సలాం ప్రాముఖ్యత
ముందుగా పలుకరించే వారు “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అంటారు దాని అర్థం "అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై కురువుగాక" అని ప్రార్ధిస్తాడు, దాని జవ్వాబులో ఎదుట ఉన్న వారు "వా-అలైకుమస్ సలాం వరహమతుల్లాహి వబరకతుహు" అని అంటారు దాని అర్థం "మరియు మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై కురువుగాక". ఇలా పరస్పరం శాంతి పలుకులతో పలకరింపులు మొదలుపెడతారు.
ఒక ముస్లింకు ఇంకో ముస్లిమ్ పై ఐదు హక్కులు ఉన్నాయి అందులో సలాం ఒకటి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “ముస్లింకు తన తోటి ముస్లింపై ఐదు హక్కులు ఉన్నాయి: అతను తన సలాంను తిరిగి చెయ్యాలి, అనారోగ్యంతో ఉన్నప్పుడు అతన్ని సందర్శించాలి, అంత్యక్రియలు హాజరు కావాలి, అతని ఆహ్వానాన్ని అంగీకరించాలి మరియు అతను తుమ్మినప్పుడు అతని కోసం ప్రార్థించండి ”(బుఖారీ).
సలాం ఇమాన్ లో ఒక భాగం . ఇస్లాంలో ఏ కార్యం ఉత్తమమని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఒక వ్యక్తి అడిగారు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానం ఇచ్చారు: “ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం మరియు మీకు తెలిసిన వారికి మరి యు మీకు తెలియని వారికి సలాం చెప్పడం.” (బుఖారీ).
సలాం చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి
అల్ హందులిల్లాహ్! సలాంను ప్రతి ముస్లిం అల్లాహ్ దయవల్ల తూచా తప్పకుండా పాటిస్తున్నారు, నిజంగా ఇది గర్వించదగిన విషయం, ఇప్పుడు సలాం ఎలా పలుకుతే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయో తెలుసుకుందాం.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు ఒక వ్యక్తి వచ్చి అస్సలాముఅలైకుమ్ అని అన్నాడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి సమాధానం ఇచ్చారు, ఆ వ్యక్తి కూర్చున్నాడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 పుణ్యాలు అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, అతడు అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అన్నాడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి సమాధానం ఇచ్చారు, ఆ వ్యక్తి కూర్చున్నాడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 20 పుణ్యాలు అన్నారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 30 పుణ్యాలు అన్నారు (బుఖారీ).
కావున సోదరులారా పై హదీసుల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే
- ఇస్లాం ధర్మంలో సలాం చేయటం అత్యంత ఉత్తమమైన కార్యం.
- పూర్తిగా సలాం పలకడం ద్వారా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి.
Masha Allah
ReplyDeleteJazakallah Khair, Follow Our Blog for Updates.
DeleteWalaikumassalam Warahmatullahi Wabarkatuhu....
ReplyDeleteMasha'Allah
Jazakallah Khair, Follow Our Blog for Updates.
Delete