Advertisement

ఇస్లాం హింసను ప్రోత్సహిస్తుందా ???

ఇస్లాం హింసను ప్రోత్సహిస్తుందా ???

ఇస్లాం గురించి అతి పెద్ద దురభిప్రాయం ఏమిటంటే "ఇస్లాం హింసను ప్రోత్సహిస్తుంది అని", కొందరు ప్రత్యర్థులు లేదా ఇస్లాం గురించి తెలిసి తెలియని అస్పష్ట జ్ఞానం (Half Knowledge) కలవారు ఖురాన్ లోని కొన్ని శ్లోకాలు తరచూ సందర్భం తెలుసుకోకుండా చూపిస్తూ ఇస్లాం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందని మరియు ముస్లిమేతరులను చంపమని ముస్లింలను ప్రోత్సహిస్తుందనే అపోహను సృష్టిస్తుంటారు.

ఉదాహరణ: ఇస్లాంను విపరీతంగా ధ్వేషించే వారు సాధారణంగా ఖురాన్ నుండి సూరా అత్-తౌబా 5 వ వచనం చూపిస్తూ విషం చిమ్ముతుంటారు ...

ముష్రిక్కులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ (ఖురాన్ 9:5)

కానీ ఈ పదాలను అర్థం చేసుకోవటానికి సరైన సందర్భాన్ని పరిశీలించడం అవసరం. "మక్కా ముష్కరులు  ముస్లింలను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ముస్లిములు మదీనా నగరానికి వలస వెళ్లిపోయారు ఆ తరువాత, ముస్లిములు మరియు ముష్కరుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కాని ముష్కరులు ఈ ఒప్పందం అయినా కొద్దీ రోజులలోనే  దాన్ని ఉల్లంఘించి ముస్లింలపై దండయాత్ర చేయడానికి వచ్చారు, అప్పుడు అల్లాహ్ ముస్లింలకు ముష్కరుల వ్యతిరేకంగా పోరాడామని  వహీ ద్వారా ఆదేశించారు. 

ఈ చారిత్రను, పోరాడే  సందర్భాన్ని తెలిసిన నిష్పాక్షిక వ్యక్తి ఎవరైనా ఇస్లాం హింసను ప్రోత్సహించదని ఖచ్చితంగా అంగీకరిస్తాడు.

ఇప్పుడు మీరు సూరా అత్-తౌబా యొక్క తరువాత శ్లోకాలను పరిశీలిస్తే, ఇస్లాంను వ్యతిరేకించే వారు కొన్ని సెలెక్టివ్ వచనాలను తీసుకోని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో తెలుస్తుంది.

 ఒకవేళ ముష్రిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణుగోరి మీవద్దకు రాదలిస్తే, అతనికి శరణు ఇవ్వండి అతడు అల్లాహ్ గ్రంధాన్ని వినే అంతవరకూ, తరువాత అతనిని అతడి భద్రతస్థలం వరకు చేర్చండి.   (సూరా అత్-తౌబా :6 వ శ్లోకం)

ఈ రోజు ఏ ఆర్మీ జనరల్ అయినా తన సైనికులను యుద్ధ సమయంలో శత్రువును విడిచిపెట్టి, అతన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లామని ఆజ్ఞాపిస్తాడు ?? 

అయితే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఖురాన్ లో ఈ విధంగా సూచించాడు. ఇస్లాం యుద్ధంలో శత్రువులను ఇతరూల మాదిరిగా కాకుండా వారి పట్ల దయ మరియు గౌరవం భావంతో చూస్తుంది.

ముహమ్మద్ సల్లెలాహు అలైహి వా సల్లం ప్రపంచానికి కరుణూణ్యంగా పంపించబడ్డారు, కానీ కొన్ని శక్తులు దయ మరియు నైతికతను తిరస్కరించినప్పుడు మరియు ముస్లింలను వంచించడానికి ప్రయత్నించినప్పుడు అయన యుద్ధానికి దిగవలసి వచ్చింది. శాంతి మరియు న్యాయం పొందే అన్ని ఇతర ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఇస్లాం యుద్ధాన్ని నిర్దిష్ట మరియు క్లిష్టమైన పరిస్థితులలో మాత్రమే అనుమతిస్తుంది. ఏ దేశానికైనా ఇది తార్కిక ఎంపిక.

ఖురాన్ 2: 190 లో అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు:


మీతో పోరాడేవారీతో మీరూ అల్లాహ్ మార్గంలో పోరాడండి, కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ప్రేమించడు. (ఖురాన్ 2:190)


మీతో పోరాడే వారితో మీరు పోరాడాలని అల్లాహ్ స్పష్టం చేశాడు, హింసను కొనసాగించే వారిపై మాత్రమే ఆయుధాలు తియ్యాలి మరియు ఆ యుద్ధంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి మరియు ఆ పరిమితులను మించవద్దని ఆదేశించబడింది.


యుద్ధంలో మహా ప్రవక్త మొహమ్మద్ సల్లేలహు అలైహి వసల్లం విధించిన హద్దులు (ఆదేశాలు)

  • చెట్లను నరకవద్దు 
  • స్త్రీలను చంపవద్దు
  • పిల్లలను చంపవద్దు
  • వ్యాధిగ్రస్తులను (జబ్బుపడిన వ్యక్తిని) చంపవద్దు
  • వృద్ధులను చంపవద్దు
  • సన్యాసులను లేదా పూజారిని చంపవద్దు
  • ఆలయాలు లేదా ప్రార్ధన మందిరాలను నాశనం చేయవద్దు
  • చనిపోయినవారిని వికృతీకరించవద్దు
  • భవనాలను నాశనం చేయవద్దు
  • ఆహారం కోసం తప్ప జంతువులను చంపవద్దు
  • లొంగిపోయిన వారిని చంపవద్దు
  • ఖైదీలతో మంచిగా ప్రవర్తించండి మరియు వారికి ఆహారం ఇవ్వండి
  • పారిపోయే  వారిని చంపవద్దు
  • ఇస్లాంలో రావడానికి బలవంతం చేయవద్దు
ఇస్లాం గురించి లోతైన పరిశీలన చేసి ముస్లింగా మరీనా వారు చాల మంది ఉన్నారు, కేవలం కొందరి మాట విని మీ మనసులలో ద్వేషం పెంచుకోకండి, ఇస్లాం తెలుసుకోండి.

Comments

Advertisement