Advertisement

ముస్లిం సమాజ నియామక లక్ష్యం? 

 ముస్లిం సమాజ నియామక లక్ష్యం? 



      ముస్లిముల అసలు నియామక లక్ష్యం- సోషల్ మీడియాలో నిత్యం వేర్పాటువాదాన్ని కోరుకునే కొందరు మతతత్వవాదులు విమర్శిస్తున్నట్లు తీవ్రవాదం చెయ్యటం కానే కాదు.. చాలా స్పష్టంగా ఖురాన్ లో అల్లహ్ ముస్లింలకు ఇలా చెపుతున్నారు... “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” - 3:110 

అన్యాయంగా ఏ జీవి ప్రాణాన్నైనా తీసే అనుమతి ఖురాన్ ఇస్తుందా? 

నిజానికి అన్యాయంగా చెసే ప్రతీ పనికి వ్యతిరేకం, ఖురాన్ ఇలా చెపుతూంది “న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151 

అన్యాయంగా మనిషిని చంపితే అది ఖురాన్ ఎంతపెద్ద ఘోరమైన పాపంగా పరిగణిస్తుందో ఈ క్రింది గమనించగలరు. 

   “హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు (బదులు హత్యగానీ) గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32

   ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్ (స) దౌర్జన్యం చెయ్యమని చెబుతున్నారా? 

“జాగ్రత్త! ఎవరైతే ముస్లిమేతరుల పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో వారి హక్కులను కాజేస్తారో వారిపై అధిక భారం మోపుతారో వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయ దినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను” - ప్రవక్త ముహమ్మద్ (స) 

 ఇదీ ముస్లిమేతరుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ఇచ్చిన ఆదేశం! వాస్తవం ఇదైనప్పుడు.. ముస్లిం వేషాలు ధరించి, ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నంత మాత్రనా మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులు లేక ముస్లిములూ కాలేరు అలాగే కాషాయం ధరించి హిందూ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ హిందువులూ కాలేరు... క్రైస్తవ పేర్లు పెట్టుకుని మారణహోమం సృష్టించేవారు నిజ క్రైస్తవులూ కాలేరు. ఎందుకంటే ఏ మతమూ ఉగ్రవాదాన్ని నేర్పదు ఉగ్రవాదం వాదం చేసే ఉన్మాదులకు ఏ మతంతోనూ సంబంధం ఉండదు. -నూరుద్దిన్-

దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్లలో తప్పక చెప్పగలరు...

Comments

Post a Comment

Advertisement