అల్లాహ్ పై భారం- విశ్వాసి లక్షణం
సర్వ సృష్టికర్త, ప్రభువు కరుణామయుడైన అల్లహ్ పేరుతో...
మనిషి ఏ చిన్న ప్రమాదం/సమస్య ఎదురొచ్చిన తన సహనాన్ని వదిలేస్తాడు, నెగటివ్ గ ఆలోచించడం, భయభ్రాంతులకు గురవుతూ ఉండడం, ఆత్మహత్యలు చెసుకొని మర్నిచడం ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో వికృత చేష్టలను కూడా చేస్తుంటాడు, ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనిషి ఎంత హీనస్థితిలో జీవిస్తున్నాడో తెలుస్తుంది... ఇది ఇలా ఉండగా
ఇస్లాం చాలా అద్భుతమైన పరిష్కారాన్ని, జీవితానికి ఒక లక్ష్యం ఉందనే భావనను మేల్కోపే ప్రయత్నం చేస్తూ మీరు మీ స్వంత సృష్టికర్త కాదు, మిమ్మల్ని పరీక్షించడానికి అల్లాహ్ మిమ్మల్ని సృష్టించాడు మరియు తదనుగుణంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తూ ఖురాన్ మనిషీ లో ఆత్మ స్థైర్యం పెంచుతుంది ...
ఖురాన్ పదాలలో ..
భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన, ప్రాణ, ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మన: స్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు, "మేమంతా అల్లహ్ కే చెందినవారము, అల్లహ్ వైపునకే మరిలి పొవలసినవారము" అని అనే వారికి శుభవార్తలు తెలుపు, వారిపై వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య కారుణ్యచ్చాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సంమార్గగాములు. (ఖురాన్ 2:155-157)
Masha'Allah
ReplyDelete