Advertisement

సృష్టి ని కాదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి


సృష్టి ని కాదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి

సృష్టి ని కాదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఇది మానవ జీవితం లో అత్యంత తెలివైన నిర్ణయం, అదే అతని ప్రథమ మరియు అంతిమ లక్ష్యం. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అందులో అనేక జీవరాసులు సృష్టించాడు కానీ కేవలం మానవులకు మాత్రమే బుద్ధినీ, ఆలోచనను, అవగాహనా శక్తిని ప్రసాదించి, సమస్త జీవరాసులలోకెల్లా ఉత్తమ సృష్టిగా అద్భుతమైన ఆకృతిలో సృజించాడు.

  
    
   సృష్టించిన తరువాత మానవులను ఊరికే వదిలేయలేదు వారికీ ఒక లక్ష్యాన్ని, ఒక విధిని ఇచ్చి ఈ భూమండలంపై పంపించాడు.  
"నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధనా కొరకు తప్ప మరిదిని కొరకూ సృష్టించలేదు" ఖురాన్ 51:56


ఇంతకూ సృష్టికర్త ఎవరు ?

  మనుషుల గుంపులు పెరిగే కొద్దీ ప్రాంతాలవారీగా వివిధ వంశాలలో, తెగలుగా, జాతులలో అందులో కులాలుగా, వర్గాలుగా చీలిపోవ సాగారు, ఆలా చీలిపోయిన తెగలు, జాతులలో కొంతమంద అహంకారానికిలోనై అందరికంటే మేమె పెద్ద, మా క్రిందే అందరు ఉండాలని గర్వాంగా భావించే  మనుషులు, కొన్ని చోట్ల తమనితాము దేవుడిగా, ఇంకా కొన్ని చోట్ల తమరు చెప్పే విధంగా నడుచుకునే రాజులను, దొరలను బూటకపు దేవుళ్ళుగా కల్పించుకున్నారు ...
  అయితే నిజానికి సృష్టిని సృష్టించిన దైవం మాత్రమే నిజదైవం ఒక్కడే మరియు సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరు లేరు, మానవ సన్మార్గం కోసం భూమ్మీద అవతరించిన దైవిక గ్రంథాలన్నీ ఈ విషయాన్నీముక్త కంఠంతో వివరించాయి. 
          అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ కూడా చాల స్పష్టంగా అత్యంత సులువైన మాటల్లో ఇలా చెబుతుంది.



"ఆయన అల్లాహ్, ఒక్కడే (అద్వితీయుడు), అల్లాహ్ నిరపేక్షాపరుడు ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు, అందరు ఆయనపై ఆధారపడేవారే, ఆయనకు సంతానము ఎవరు లేరు, ఆయన ఎవరికీ సంతానమూ కాదు, ఆయనకు సరిసమానులు ఎవరు లేరు." (ఖురాన్ 112:1-4).

     సర్వ శక్తిమంతుడైన దేవునికి తోడు ఇంకొద్ది మంది దేవుళ్లూ ఉన్నారు, ఒక్కో జాతికి, మతానికి ఒక్కో దేవుడు  అని మనలో చాలా మంది అంటున్నారు. ఇలా అనటం అతి ఘోరమైన తప్పిదం. "మనందరికీ ప్రభువైన దేవుడు అల్లాహ్ ఒక్కడే ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేదు." తన దాసులు ఆయనకు అనుగుణంగా తమ కర్మలు చేయాలనీ ఆకాంక్షిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు తమకు ప్రసాదించబడిన జ్ఞానాన్ని ఉపయోగించి వ్యవహరించాలి, రుజుమార్గంపై తాము నడవాలి, ఇతరులను సైతం నడిపించాలి అని కోరుకుంటూ... 
            “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”

Comments

Advertisement