జిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలు
మరియు ముస్లింల ఆచరణ.
‘అల్లాహు అక్బర్’ ‘అల్లాహు అక్బర్’ – ‘లాయిలాహ ఇల్లల్లాహ్’ , ‘లా హౌలా వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్’
జిల్ హజ్జ్ యొక్క మొదటి పది రోజులు పూర్తి సంవత్సరంలో ఉత్తమ రోజులు.
"ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ పది రోజులలో చేసే పుణ్య కార్యక్రమాలు సాధారణ రోజులలో చేసే దానికన్నా అల్లాహ్ కు ఎక్కువ ప్రియమైనవి." [బుఖారి]
ఈ పవిత్ర రోజులను సరిగ్గా ఉపయోగించుకోవడానికి కొన్ని సూచనలు:
1. ఖురాన్ చదవడం
ఖుర్ఆన్ చదవడం ఎన్నో సత్కార్యాలు చేయడంతో సమానం మరియు అల్లాహ్ ముఖ్యంగా ఈ రోజుల్లో చేసిన మంచి పనులను ప్రేమిస్తాడు. మీకు వీలైనంత వరకు చదవండి.
2. తహజ్జుత్ మరియు నవాఫిల్ నమాజులు ఎక్కువ చదవడం.
మీ ఆరాధన మరియు మంచి పనులను పెంచడానికి మీరు నమాజు తరువాత చేయగలిగే అన్ని నఫిల్ నమాజులు చేయాలి.
3. జికర్ చేస్తూ సమయం గడపండి.
"అల్లాహ్ ముందు ఈ పది రోజుల కన్నా గొప్ప రోజులు లేవు, ఈ రోజుల్లో చేసే పుణ్య కార్యక్రమాలు ఆయనకు ఎక్కువ ప్రియమైనవి, కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్ పఠించాలి."
‘అల్లాహు అక్బర్’ – ‘లాయిలాహ ఇల్లల్లాహ్’ , ‘లా హౌలా వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్’
తహ్లీల్ "లా ఇలాహ ఇల్లాలాహ్"
తక్బీర్ అంటే "అల్లాహు అక్బర్"
తహ్మీద్ అంటే "అల్హాముదుల్లాహ్"
తస్బీహ్ "సుభనల్లాహ్" అని చెప్పాలి.
4. అస్తగ్ఫార్ చేయటం
మన తప్పులన్నింటికీ క్షమాపణ కోరడానికి ఈ దీవించిన రోజులను ఉపయోగించుకోండి.
5. ఉపవాసం ఉండటం
జిల్ హజ్జ్ యొక్క మొదటి తొమ్మిది రోజులలో ముస్లింలు ఉపవాసం ఉండటం సున్నత్, ఎందుకంటే ఉపవాసం ఉత్తమమైన ఆరాధనలో ఒకటి.
6. బంధుత్వ సంబంధాలను కొనసాగించడం
బంధుత్వ సంబంధాలను కొనసాగించడం, బంధువులతో మంచిగా వ్యవహరించడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలలో ఉత్తమమైన పనులలు,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “ఎవరైతే తన సంపాదన పెరగాలని మరియు అతని ఆయుష్షు పొడిగించబడాలని కోరుకుంటున్నారో, అతడు బంధుత్వ సంబంధాలను అత్యంతమంచిగా కొనసాగించాలి.” [బుఖారి]
7. పేదలకు ఆర్ధిక సహాయం చేయటం (సదఖా ఇవ్వడం)
ఈ దీవించిన రోజుల్లో మీకు వీలైనంత ఎక్కువగా సదఖా ఇవ్వండి.
‘అల్లాహు అక్బర్’ – ‘లాయిలాహ ఇల్లల్లాహ్’ , ‘లా హౌలా వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్’ ఈ వాక్యాలు ఈపది రోజులు మన నోళ్లలో నానుతుండాలన్న ఉలమాల ఉద్బోధను తూ.చ.తప్పకుండా పాటిద్దాం. ‘జిల్ హిజ్ 9వ రోజు (అరఫా రోజు) చేసే ఉపవాసం వల్ల కిందటి ఏడాది పాపాలు వచ్చే ఏడాది పాపాలు మన్నించబడతాయి.’ అన్న ప్రవక్త ప్రవచనానికనుగుణంగా ఆరోజు ఉపవాసం పాటిద్దాం. స్థోమతగల వారు జిల్ హిజ్ పదో తేదీన అంటే బక్రీదు పండుగ నాడు ఖుర్బానీ చేసి అల్లాహ్ కు ప్రీతిపాత్రులవ్వాలి.
Comments
Post a Comment