అరాఫా రోజు - Part-2/2
అరాఫా రోజున చేయవలసిన పనులు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"అరాఫా రోజు తప్ప మరేరోజు లేదు అల్లాహ్ ఈ రోజే అత్యంత ఎక్కువగా నరకాగ్నినుండి విముక్తి కలిగిస్తారు. అల్లాహ్ వారి (అరాఫత్ మైదానం వద్ద నిలబడి దుఆ చేస్తున్న వారి) దగ్గరగా వస్తాడు, మరియు ఆయన తన దేవదూతల ముందు ‘ప్రజలు ఏమి కోరుకుంటున్నారు' చెబుతాడు."
(ముస్లిం)
అరాఫా రోజున చేయవలసిన పనులు:
1. అరాఫా రోజున ఉపవాసం:
ఎవరైతే హజ్ యాత్రకు వెళ్లారో వారికీ ఈరోజు ఉపవాసం ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సూచించారు.
"ఇది గత సంవత్సరం చేసినవి మరియు రాబోయే సంవత్సరంలో చేసే పాపాలను తొలగిస్తుంది." (ముస్లిం)
2. అరాఫా యొక్క దుఆ: ఈ దువాను చాలా తరచుగా చేయాలి
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:"అరాఫా రోజు దుఆ చాలా అద్భుతమైన దుఆ, నేను మరియు నా ముందు ప్రవక్తలు చెప్పిన వాటిలో ఉత్తమమైనది,
لا إله إلا الله وحده لا شريك له ، له الملك ، وله الحمد وهو على كل شيء قدير
"అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు, అయన ఒక్కడే మరియు ఆయనకు భాగస్వామి ఎవరు లేడు, అన్నిటికి ఆయనే ఆధిపతి మరియు అన్ని స్తోత్రాలు ఆయనకే, అయన అన్నిటిపై అధికారం కలవాడు. '"(మువత్తా)
3. తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ మరియు తస్బీహ్ పఠించడం:
ఇది మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ అరాఫా రోజున, మరియు తష్రీక్ రోజులలో (ధుల్ హిజ్జాలో 11, 12 మరియు 13 వ తేదీ) తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్లను వీలైనంత ఎక్కువసార్లు పాటించాలి.
తహ్లీల్ "లా ఇలాహ ఇల్లాలాహ్"
తక్బీర్ అంటే "అల్లాహు అక్బర్"
తహ్మీద్ అంటే "అల్హాముదుల్లాహ్"
తస్బీహ్ "సుభనల్లాహ్" అని చెప్పాలి.
అరఫా రోజు (యూముల్ అరఫా) ఉమ్మతే ముహమ్మద్ (స) అందరూ కూడా ఉపవాసం ఉండి, అల్లాహ్ తో నరకాగ్ని విముక్తి కోసం ప్రార్ధిస్తూ, తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ మరియు తస్బీహ్ పఠిస్తూ అల్లాహ్ కు కృతజ్ఞతా తెల్పుదాం మరియు మహమ్మారి కారోణా నుండి ప్రజలను రక్షించాలని కోరుకుందాం ఇన్షా అల్లాహ్.
Comments
Post a Comment