Islam and Nature
ఇస్లాం మరియు ప్రకృతి
ప్రకృతితో కలిసి జీవిద్దాం
ఇస్లాం సందేశం
‘మరికాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుందని తెలిసినా మీ చేతిలో మొక్క ఉంటే దానిని నాటండి’ అని అన్నారు ప్రవక్త (స).
వృక్ష సంపద విలువను తెలియజేయడానికి ఇంతకంటే గొప్ప ఉపమానం మరొకటి ఏముంటుంది. ‘ ప్రతి వ్యక్తీ ఒక మొక్క నాటినా... దాని ఫలాలను పక్షిగానీ, పశువులుగానీ, మనుషులుగానీ తిన్నా.. నాటిన వ్యక్తికి ఎంతో పుణ్యం లభిస్తుంది’ అని చెప్పి మొక్కలు నాటడాన్ని 1500 ఏళ్ల క్రితమే ప్రోత్సహించారు ముహమ్మద్ ప్రవక్త.
మనిషి ఈ ధరిత్రిపై అడుగు పెట్టకముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడని ఖురాన్ చెబుతుంది. వృక్ష సంపద గురించి ఇస్లాం ధర్మంలో అపార జ్ఞానసంపద ఉంది.
‘ఎవరికీ చెందని ఓ బంజరు నేలను పంట పొలంగా మార్చిన వ్యక్తికే ఆ భూమి చెందుతుంది...అని చెప్పి సేద్యాన్ని ప్రోత్సహించారు ప్రవక్త.
యుద్ధ సమయంలోనూ నీడనిచ్చే చెట్లను నరకరాదని, శత్రువుకు చెందిన పంటపొలాలను నాశనం చేయకూడదని చెప్పారు. నీడనిచ్చే చెట్ల కింద మలమూత్రాలు చేయడాన్ని ప్రవక్త (స) తీవ్ర నేరంగా చెప్పారు. నదీజలాలలో మలమూత్రాలు చేసేవారిని శపించారు. దేహానికి ఆత్మ ఎలాంటిదో పర్యావరణానికి చెట్టు ఆత్మలాంటిది. మనిషికి ప్రాణవాయువు అందించే చెట్టును కాపాడుకుంటేనే మనిషి జీవితం సుభిక్షం అవుతుందంటారు ప్రవక్త.
Comments
Post a Comment