The importance of the remembrance of Allah
అల్లాహ్ స్మరణ ప్రాముఖ్యత
Hadees
మహా ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు :
"మీ ఆచరణలన్నిటి లోకెల్లా శ్రేష్టమైన ఆచరణ ఏమిటో మీకు చెప్పనా ? అది మీ గౌరవాన్ని పెంచుతుంది, మీరు చేసే వెండి బంగారంల వ్యయం కన్నా విలువైనది, అంతేకాదు, మీరు మీ శత్రవుల్లోకి జొరబడినప్పుడు వారి తలలు మీరు మీ తలలు వారు ఖండించే పని కన్నా ఏంటో శ్రేష్టమైనది." దానికి అనుచరులు (రజి) "చెప్పండి దైవప్రవక్త అన్నారు," అప్పుడు దైవప్రవక్త (స) "అదే అల్లాహ్ ను స్మరించడం" అని చెప్పారు.
(తిర్మిజీ, ఇబ్నెమాజ)
ఇంకా మహా ప్రవక్త సల్లేలహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు :
అల్లాహ్ ఇలా చెబుతున్నాడు - "నా గురించి నా దాసుని ఆలోచానలు ఎలా ఉంటాయో నేను అలాగే ఉంటాను, నా దాసుడు నన్ను స్మరిస్తున్నప్పుడు నేను అతనితో పాటు ఉంటాను, అతను నన్ను తన మనస్సులో స్మరిస్తే నేనతన్ని నా మనన్సులో తలుస్తాను, ఆతను నన్ను ఏదైనా జనసమూహంలో స్మరిస్తే, నేనతని గురించి అంతకంటే శ్రేష్ఠమైన (దైవదూతలా) సమూహములో ప్రస్తావిస్తాను. ఒకవేళ అతను నా వైపునకు జానెడు దూరం జరిగితే నేను అతని వైపునకు మూరెడు దూరం సమీపిస్తాను, ఒక బారెడు దూరం సమీపిస్తే నేను నా రెండు చేతులను జాపి అతన్ని సమీపిస్తాను. ఒక వేళా అతను నా చెంతకు నడిచివస్తే నేను పరుగెత్తి అతన్ని చేరుకుంటాను.
(బుఖారి, ముస్లిం)
Comments
Post a Comment