Advertisement

ఆశుర ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

 ఆశుర ఉపవాసం యొక్క ప్రాముఖ్యత 

ఆశుర మొహర్రం నెలలోని పదోవ రోజును అంటారు, ఈ 2020 లో సంవత్సరం ఆశుర ఉపవాసం రోజు ఆగష్టు 30 వ తారీకున వస్తుంది, మొహర్రం నెల ఇస్లామీయ క్యాలెండరు లో మొదటి నెల, ఈ నెల ఇస్లామీయ చరిత్ర లో చాల ప్రాముఖ్యత ఉంది, మొహమ్మద్ సల్లేలహు అలైహి వసల్లం హదీస్ ప్రకారం మొహర్రం నాలుగు పవిత్రమైన (నిషిద్దమైన) మాసాలలో ఒక నిషిద్ధ మాసం. 

హజరత్ అబూబకర్ రజి అల్లాహు అన్హు కధనం, మహా ప్రవక్త సల్లేలహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు “పన్నెండు నెలలు సంవత్సరం లో నాలుగు నెలలు పవిత్రమైనవి (నిషిద్దమైనవి): వాటిలో మూడు వరుసగా ధుల్-ఖా, ధుల్-హిజ్జా మరియు మొహర్రం, మరియు (నాల్గవది) రజ్జబ్." సహి బుఖారి. 



ఆశుర అంటే ఏమిటి? 

అశురకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఈ కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండేవారు. రంజాన్ మాసంకు ముందు మొహర్రం 10 న ఉపవాసం ఉండటం విధిగా ఉంది. అయితే తరువాత రంజాన్ మాసంలో మాత్రమే ఉపవాసం తప్పనిసరి చేయబడింది.  

హజ్రత్ ఈషా (రా) కథనం: రంజాన్ ఉపవాసం తప్పనిసరి కావడానికి ముందే ప్రజలు ‘అశురా (మొహర్రం నెల పదవ రోజు) ఉపవాసం ఉండేవారు. మరియు ఆ రోజున కబా కప్పబడి ఉండేది. అల్లాహ్ రంజాన్ మాసం ఉపవాసాలు తప్పనిసరి చేసినప్పుడు, మహా ప్రవక్త సల్లేలహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, “ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో (‘అషురా ’రోజున) వారు ఉండవచ్చు, ఎవరైతే దానిని వదిలివేయాలనుకుంటున్నారో అలా చేయవచ్చు. ” (బుఖారీ 1592)

అయితే ఈ రోజు  మహా ప్రవక్త సల్లేలహు అలైహి వసల్లం ఎందుకు ఉపవాసం ఉన్నారు? 

ఈ రోజున, మూసా అలైస్సలం వారు అల్లాహ్ సహాయంతో అద్భుతం చేసారు, తద్వారా సముద్రాన్ని రెండు భాగాలుగా విభజించడం ద్వారా తన ప్రజలను ఫిరౌన్ నుండి రక్షించగలిగారు, తన ప్రజలు సురక్షితంగా సముద్రం దాటడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు, ఫిరౌన్ సైన్యం మునిగిపోయింది. అందువల్ల, యూదులు అశుర అనగా ముహర్రం 10 వ తేదీన ఉపవాసం ఉండేవారు. 

ఇబ్నె అబ్బాస్ కథనం: ప్రవక్త (ﷺ) మదీనాకు వచ్చినప్పుడు, యూదులు అశుర అనగా ముహర్రం 10 వ తేదీన ఉపవాసం ఉండడం చూసి వారు ఇలా అన్నారు: "నేను వారికంటే (యూదులకంటే) మూసాకు దగ్గరగా ఉన్నాను" అని అన్నారు. కాబట్టి, ఆయన ఆ రోజు ఉపవాసం పాటించారు మరియు ముస్లింలను ఉపవాసం ఉండాలని ఆదేశించారు.

ప్రవక్త (ﷺ) సహచరులు యూదులు అశుర రోజున ఉపవాసం ఉండడం గమనించారు వారికి కూడా ఆ రోజు ఎంతో పవిత్రమైనది, ప్రవక్త (ﷺ) యూదులకు వేరుగా రెండు రోజులు ఉపవాసం ఉండాలని నిర్ణయించారు, మొహర్రం 9 మరియు 10 (ఆశుర రోజు) లేదా మొహర్రం 10 (ఆశుర రోజు) మరియు 11 వ తేదీలలో ఉపవాసం ఉండాలని నిర్దేశించారు. 

అశురా (మొహర్రం 10 వ తేదీ) రోజు ఉపవాసం గురించి ప్రవక్త (స) అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు:

"ఇది మునుపటి సంవత్సరం చేసిన పాపాలను తొలగిస్తుంది." (ముస్లిం 6: 2603)

"రంజాన్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉపవాసం ముహర్రం 10 (ఆశుర రోజు)" అని సెలవిచ్చారు.  (ముస్లిం 6: 2611) 

అల్లాహ్ దయవల్ల మనమందరం ఆశుర యొక్క ఉపవాసం ఉండి, అల్లాహ్ సాన్నిధ్యం లో మన తప్పుల క్షమించాలని దుఆ చేస్తూ 


అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బారకాతుహు ...

Comments

Post a Comment

Advertisement