పొరుగువారి హక్కులు
ఇంటర్నెట్ కాలం మానవుడు దినదినాభివృద్ధి చెందుతున్న కాలం, ప్రతిరోజు ఒక కొత్త సాఫ్ట్ వెర్, సెకండుకు ఒక సోషల్ మీడియా అప్డేట్, వెలది మెసేజ్ ఫార్వర్డ్స్, వందలాది నోటిఫికెషన్స్ తో మానవుడు బిజీగా మారిపోతున్న. క్రమేణా మానవ సమాజం మరీ ముఖ్యంగా సమాజంలోని కొత్త జనరేషన్ వారిలో తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల గౌరవమర్యాదలు, సోదరభావం క్షీణించిపోవడం జరుగుతుంది ఇది మన కళ్ళతో చూస్తున్న కఠోర సత్యం, వీటన్నిటికీ ముఖ్య కారణం దైవభీతి తగ్గిపోవటమే.
ఒక మానవునిపై ఇస్లాం తల్లిదండ్రుల హక్కులతో పాటు ఇరుగుపొరుగు వారికీ కూడా హక్కులను కల్పిస్తుంది, ఖురాన్ లో చాల స్పష్టంగా అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు:
"మీరంతా అల్లాహ్ దాస్యం చెయ్యండి, ఎవరిని అయనతోపాటు భాగస్వాములుగా చెయ్యవద్దు. తల్లిదండ్రుల ఎదల సద్భావంతో మెలగండి, బంధువుల అనాధల, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి, పొరుగున ఉన్న బంధువులు, ఆపరిచితులైన పొరుగువారు, ప్రక్కన ఉన్న మిత్రులు, బాటసారులు, మీ వద్ద పనిచేసే వారి పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి" (ఖురాన్ 4:36)
ఈ అయతు మనం కలిసే, మాట్లాడే లేదా మన చుట్టూ నివసించే వారి పట్ల మన భాధ్యతల్ని స్పష్టం చేస్తోంది. మన నేటి సమాజంలో అందరు తమ తమ వ్యక్తిగతంగా ఈ విషయమై ద్రుష్టి కేంద్రీకరించవలసిన అవసరం చాల ఉంది.
ఈ అయతులో అల్లాహ్ ముస్లిం అనే పదం వాడలేదు. మిత్రులతో, బాటసారులతో, పొరుగువారితో మంచిగా ఉదార స్వభావంతో (Generous) ఉండండి అని స్పష్టంగా ఆజ్ఞాపిస్తునాడు, కాబట్టి మన పొరుగు వారు ముస్లిం అయినా, ముస్లిమేతరులు అయినా మంచిగా ఉండడం ఒక ముస్లింగా మన కర్తవ్యం.
ముఖ్యంగా మన దేశంలో మత సామరస్యం పెంచుందుకు, సోదరభావాన్ని పటిష్ట పరిచేందుకు ఇరుగుపొరుగు వారి పట్ల తమ తమ భాధ్యతల్ని పాటించడమే మన నైతిక ధర్మం మరియు మౌలిక సూత్రం. పొరుగువారి విషయం లో మాహా ప్రవక్త ముహమ్మద్ సల్లేలహు అలైహి వసల్లం వారు మను కాకిడు చేసిన భాద్యతలు హదీస్ (ప్రవచనాల) ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఒక సభలో మహా ప్రవక్త ఇలా సెలవిచ్చారు "అతను విశ్వసి కాడు, దైవ సాక్షిగా ఆటను విశ్వసి కాడు" అప్పుడు అక్కడ ఉన్న సహాబీలు (అనుచరులు) "దైవ ప్రవక్త (స) ఎవరు అతను?" అని అడిగారు, "ఎవరి చేతనైతే అతని పొరుగువారు కష్టాలపాలవుతారో అతను", "ఎవరి పొరుగువారికైతే అతను పెట్టే కష్టాల వాళ్ళ శాంతి శూన్యమవుతుందో అతను అని ప్రవచించారు" (బుఖారి).
ఈ హదీసు ప్రకారం ఒక ముస్లిం తన పొరుగువారి కష్టానికి భాద్యుడైతే అతనిని ముస్లిం సమాజంలోనుంచి తీసేసినట్టే. అతడు ఇంకా విశ్వసిగా పరిగణించబడదు.
ఇబ్నె అబ్బాస్ (ర) ఉల్లేఖించారు "తానూ కడుపు నిండా భుజించి, తన ప్రక్కన ఉండే పొరుగువారు పస్తులుండడాన్ని సహించే వ్యక్తి విశ్వసి కాజాలడు" అని మహా ప్రవక్త (స) భోదించగా నేను విన్నాను. (మిష్కాత్)
ఈ హదీసు ప్రకారం కూడా ఒక ముస్లిం కడుపు నిండా తిని తన పొరుగువారు పస్తునుంటే అతనిని ముస్లిం సమాజంలోనుంచి తీసేసినట్టే. అతడు ఇంకా విశ్వసిగా పరిగణించబడదు.
అబుజార్ (రజి)కు దైవ ప్రవక్త ఇలా ఉపదేశించారు " అబుజార్ ! నీవు ఏదైనా కూర వంగినప్పుడు అందులో కాస్త నీరు ఎక్కువ పొయ్యి (సూప్ ఎక్కువ చేసి), పొరుగువారిని కూడా పంపించు".
అంటే మనం మంచి కూర వండుకున్నపుడు లేదా పక్కవారి దగ్గర కూర లేని యడల, మన దగ్గర ఉన్నదానిలో కాస్త నీరు ఎక్కువ కలిపైనా వారికీ అందించాలి అది మన భాద్యతగా మహా ప్రవక్త (స) వర్ణించారు.
ఇంకా ఇరుగు పొరుగు వారికీ తరచూ మన సామర్ధ్యం మేరకు కానుకలు ఇవ్వడానికి కూడా ప్రోత్సహించారు మహా ప్రవక్త (స).
హజ్రత్ ఈషా (రజి) ఇలా ఉల్లెకించారు " నాకు ఇద్దరు పొరుగువారుంటే వారిలో కానుక ఎవరికీ పంపాలి? అని నేనడిగినదానికి మహా ప్రవక్త (స) నీ వాకిలికి ఎవరి వాకిలి అతి సమీపమో వారికీ" అని ప్రవచించారు. (బుఖారి)
అంటే స్తొమత సామర్ధ్యం మేరకు ఒక్కరికే కనుక ఇవ్వదలుచుకుంటే మన సమీపంలో ఉన్న వారికీ ఇవ్వడం ఉత్తమం అని మహా ప్రవక్త బోధించారు.
మంచివాళ్ళతో మంచిగా ప్రవర్తించడం సర్దుకుపోవడంలో సహజంగా మన సమాజంలో జరుగుతూనే ఉంటుంది, కానీ ఎలాంటి పొరుగువారితోనైనా సరే మంచిగా ఉదార స్వభావంతో మెలగడం ముస్లింగా మన కర్తవ్యం. అల్లాహ్ మనకు ఈమాన్ భాగ్యాన్ని ప్రసాదించాడు, కాబట్టి అల్లాహ్ మరియు మహా ప్రవక్త మొహమ్మద్ సల్లేలహు లాహి వస్సలామ్ బోధనల ప్రకారం మన జీవితం గడపడం ముస్లింలమైన మన భాద్యత, ఈ భాద్యతను విస్మరిస్తే ప్రళయ దినాన మన వ్యవహారం రచ్చకెక్కుతుంది, ఆపై భయంకర పరిణామాలను ఏడుకోవాల్సి ఉంటుంది.
అస్సలాముఅలైకుం
Comments
Post a Comment